AP : డిప్యూటీ సీఎం పదవిపై పవన్ కళ్యాణ్ ఆసక్తి

Update: 2024-06-10 04:56 GMT

జనసేన ( Jana Sena ) చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan ) రాష్ట్ర ప్రభుత్వంలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు ఇండియా టుడే వెల్లడించింది. డిప్యూటీ సీఎం పదవిని తీసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారని తెలిపింది. నిన్న మోదీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జర్నలిస్టు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. కాగా పదవి విషయంపై పార్టీ అధికారికంగా ప్రకటించలేదు. రేపు NDA ఎమ్మెల్యేల భేటీలోఈ అంశంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన NDA ఎమ్మెల్యేలు రేపు భేటీ కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మంగళగిరిలో ఈ సమావేశం జరగనుంది. సీఎంగా ఎల్లుండి CBN ప్రమాణ స్వీకారం, మంత్రి పదవుల కేటాయింపు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. టీడీపీ నుంచి 135, జనసేన నుంచి 21, బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలిచిన విషయం తెలిసిందే.

కూటమి గెలుపుతో రాజధాని అమరావతిలో పనులు జోరందుకున్నాయి. చంద్రబాబు ప్రమాణస్వీకారంలోపు జంగిల్ క్లియరెన్స్ (ముళ్ల కంపల తొలగింపు) పూర్తి కానుంది. 109 KM నిడివిలోని 673 ఎకరాల విస్తీర్ణంలో 94 పొక్లయిన్లతో పనులు జరుగుతున్నాయి. కరకట్ట, సీడ్ యాక్సెస్ రోడ్లపై సెంట్రల్ లైటింగ్ పున:ప్రారంభించారు. TDP హయాంలో చేపట్టిన నిర్మాణాలు ఐదేళ్లుగా నిలిచిపోవడంతో వాటి పటిష్ఠతపై నిపుణులు పరిశీలన చేయనున్నారు.

Tags:    

Similar News