AP Home Minister : జగన్ కన్నా ప్రజలే ముఖ్యం.. సవాళ్లతో పనిలేదన్న హోంమంత్రి అనిత
ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసే సవాళ్లను స్వీకరించేందుకు తాము సిద్ధంగా లేమని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. సచివాలయంలో పోలీస్ కానిస్టేబుళ్ల తుది ఫలితాలను విడుదల చేసిన ఆమె.. మీడియాతో మాట్లాడారు. జగన్ నెల్లూరు పర్యటనలో పోలీసుల లాఠీఛార్జ్‌పై స్పందించారు. పోలీసులు వాళ్ల డ్యూటీ వాళ్లు చేశారన్నారు. జగన్ చేసే సవాళ్లను స్వీకరించేందుకు టీడీపీ నాయకులు సిద్ధంగా లేరని.. జగన్ కన్నా తమకు ఓటు వేసిన ప్రజలే ముఖ్యమని వ్యాఖ్యానించారు. ప్రజా సంక్షేమం కోసమే తమ టైమ్‌ను వినియోగించుకుంటామని స్పష్టం చేశారు.
అంతేకాకుండా జగన్ రాష్ట్రంలో ఏ పర్యటనకు వెళ్లినా భద్రత కల్పిస్తున్నట్లు అనిత తెలిపారు. కాగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య లేదని చెప్పుకొచ్చారు హోంమంత్రి. ఇక పోలీస్ శాఖలో సిబ్బంది కొరత వాస్తవమని.. త్వరలోనే కానిస్టేబుళ్ల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. ఈ మధ్య కాలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సైలెంట్ గా ఉన్నప్పటికీ వైసీపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఎవరు ఏం చేసినా.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని కామెంట్ చేశారు