Pattabhi Ram: పట్టాభి ఇంటి వద్ద పోలీసుల హడావుడి.. కదలికలను గమనిస్తూ..
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు.;
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. పట్టాభికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారం రోజుల క్రితం కూడా 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఆ సమయంలో మీడియా ప్రతినిధులు ఉండడంతో.. పోలీసులు వెనక్కి తగ్గారు. మళ్లీ నిన్న రాత్రి నుంచి పట్టాభి ఇంటి వద్ద పోలీసుల హడావుడి కనిపిస్తోంది. రాత్రి నుంచి పట్టాభి నివాసం వద్ద అదనపు పోలీసులను మోహరించారు. పట్టాభి కదలికలను పోలీసులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు.