Polio : తిరుమలలో రేపు ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు

Update: 2024-03-02 05:30 GMT

రేపు అంటే మార్చి 03 ఆదివారం రోజున తిరుమలలో ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కల్ని వేసే కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ కార్యక్రమం మార్చి 3న ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయం ముందు ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగుస్తుంది. భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో పల్స్ పోలియో చుక్కల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

అశ్విని ఆసుపత్రి, ఆర్టీసీ బస్టాండ్, జియన్ సి టోల్ గేట్, సిఆర్ ఓ, పిఎసి 1 మరియు 2, కొత్త బస్టాండ్, హెల్త్ ఆఫీస్, విక్యూసి 1 మరియు 2, ఏటిసి, ఎంబిసి-34, వరాహస్వామి విశ్రాంతి గృహం 1, రాంభగీచా రెస్ట్ హౌస్ 1, కేకేసి, మేదరమిట్ట, పాపవినాశనం, సుపాదం, బాలాజీ నగర్ వినాయక ఆలయం, బాలాజీ నగర్ బాల బడి, ఎస్వీ హై స్కూల్, తిరుమల ఆలయం లోపల మరియు వెలుపల, ఉద్యోగుల డిస్పెన్సరీలతో సహా మొత్తం 25 కేంద్రాలలో పోలియో చుక్కలు వేస్తారు.

మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ కొంతమేర తగ్గింది. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. భక్తులు 7 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న 59 వేల 646మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. హుండీ ద్వారా రూ.3.86 కోట్లు ఆదాయం సమకూరిందని టీటీడీ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News