AP : ఏపీలో మరో నాలుగు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు హెచ్చరికలు...

Update: 2025-09-15 07:15 GMT

రెండు తెలుగు రాష్ట్రాలపై వరుణుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా ఈ వర్షాల ప్రభావం మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ముఖ్యంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి తోడుగా ద్రోణి ప్రభావం వల్ల ఈ వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు.

గత రెండు రోజులుగా ఏపీ లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న గుంటూరులో కురిసిన వర్షాలతో నగరం జలమయమైంది. అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News