జనసేన అధినేత, ఏపీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) గతంలో రేణు దేశాయ్ ను ( Renu Desai ) పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనంతరం వివిధ కారణాలతో ఇరువురు విడిపోయారు. అయితే రేణూ దేశాయ్ పెట్టిన ప్రతి పోస్ట్కా చాలా సందర్భాలలో పవన్ కళ్యాణ్ ప్రస్తావనను ఆయన ఫ్యాన్స్ తెస్తుంటారు. దీంతో తన పర్సనల్ లైఫ్ లోకి పవన్ కళ్యాణ్ ను తీసుకురాకండంటూ.. రేణు దేశాయ్ చెప్పిన వినిపించుకోవట్లేదు.
తాజాగా పవన్ కళ్యాణ్ ఏపీ మంత్రి అయిన సందర్భంగా.. ఓ అభిమాని రేణును ట్యాగ్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు. 'వదిన గారు మీరు కొన్ని రోజులు ఓపిక పట్టి ఉంటే బాగుండేది. ఒక దేవుడ్ని పెళ్లి చేసుకుని ఆయన అంతరంగం తెలీకుండా వెళ్లిపోయారు. కానీ ఈ రోజు అయినా మీకు పవన్ విలువ తెలిసింది. ఏది ఏమైనా విధి ప్రతిదీ నిర్ణయిస్తుంది.
ఈ రోజు పిల్లలు అన్నయ్యతో ఉన్నారు చాలు వదిన. మిమ్మల్ని మిస్ అవుతున్నాం.' అంటు రాసుకొచ్చాడు. దీనిపై రేణు దేశాయ్ తీవ్రంగా మండిపడింది'. మీకు కొంచెం అన్న బుద్ది ఉంటే ఇలా చెప్పరు. పవన్ కళ్యాణ్ను నేను వదిలేయలేదు. అతనే నన్ను వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. దయచేసి నన్ను టార్చర్ చేయకండి' అంటూ రిప్లే ఇచ్చింది.