Renu Desai : రేణుదేశాయ్ లేటెస్ట్ పోస్ట్.. అర్థం కాక పవన్ ఫ్యాన్స్ గిలగిల

Update: 2024-04-15 10:55 GMT

పవన్ కల్యాణ్ మాజీ భార్యగా రేణు దేశాయ్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. ఏపీలో ఎన్నికల టైంలో చంద్రబాబు, జగన్ ల భార్యలు కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. వారి అభిమానులు కూడా కాన్వాసింగ్ లో పాల్గొంటున్నారు. మరి పవన్ తరఫున మహిళలు ఎవరూ పెద్దగా ప్రచారంలోకి రావడం లేదు. పైగా వ్యతిరేకులే వస్తున్నారు. మరి పవన్ కు రేణు దేశాయ్ ప్రచారం చేస్తుందా... లేదా అన్న చర్చ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో జరుగుతోంది.

రేణు దేశాయ్ తాజాగా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. మరి కొద్ది రోజుల్లోనే ఎలక్షన్స్ జరగబోతూ ఉండగా ఆమె ఇలాంటి పోస్ట్ పెట్టడంపై జనాలు ఫైర్ అయిపోతున్నారు . సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ తన చేతికి ఉన్న పచ్చబొట్టున ఫోటో తీసి దానిని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది .

'కొన్నిసార్లు చిత్రం పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది ' నా పచ్చబొట్టు మౌనం పరమశిలం' అని ఆ పోస్ట్ సారాంశం. దీనిని రాజకీయాలకి ముడి పెడుతూ ఎలక్షన్స్ 2024 అనే హ్యాష్ ట్యాగ్ జోడించింది. దీంతో సోషల్ మీడియాలో రేణూ దేశాయ్ పెట్టిన పోస్ట్ ట్రెండ్ అవుతుంది. ఇంతకీ.. రేణుదేశాయ్.. ఎవరు టార్గెట్ గా.. ఎవరికి సపోర్ట్ గా ఈ పోస్ట్ పెట్టారంటూ చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News