ఏపీ సీఎం కార్యాలయంలోకి సీనియర్ ఐఏఎస్‌లు ఏవీ రాజమౌళి ( AV Rajamouli ), కార్తికేయ మిశ్రాలను ( Karthikeya Mishra ) తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీకి చెందిన రాజమౌళి 2015-19 మధ్య సీఎం కార్యదర్శిగా పనిచేశారు. ప్రస్తుతం యూపీ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయ కేంద్ర ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్నారు. వీరిద్దరిని డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏవీ రాజమౌళి 2003 బ్యాచ్ ఉత్తర్‌ప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. 2014 టీడీపీ ప్రభుత్వంలో 2015-19 మధ్య ముఖ్యమంత్రి కార్యదర్శిగా సీఎంవోలో కీలకంగా పనిచేశారు. రాజమౌళిప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కార్తికేయ మిశ్రా 2009 ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి.. ఆయన ప్రస్తుతం డిప్యుటేషన్‌పై కేంద్ర ఆర్థిక సేవల శాఖలో డిప్యూటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన్ను రిలీవ్ చేసి ఆంధ్రప్రదేశ్‌కు పంపించాలని కేంద్రాన్ని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం ( Chandrababu Government ) లేఖ రాసింది.