ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి విజయంపై జగన్ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు మరికొన్ని గంటలు ఉండగానే పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలతో 6న తాడేపల్లిలో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ నేతలకు సూచనలు చేశారు. కౌంటింగ్ తరువాత ప్రతీ ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వాలని.. ఎంపీ అభ్యర్ధులతో సహా అందరూ తాడేపల్లిలో అందుబాటులో ఉండాలని సూచించారు. జూన్ 9న జగన్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారానికి ఇప్పటికే ముహూర్తం నిర్ణయించారు.