Bojjala Gopala Krishna Reddy : మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కన్నుమూత.. !

Bojjala Gopala Krishna Reddy : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి స్వర్గస్తులయ్యారు.

Update: 2022-05-06 10:39 GMT

Bojjala Gopala Krishna Reddy : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి స్వర్గస్తులయ్యారు. ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆపోలో ఆసుపత్రికి తరలించారు. దీంతో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులక్రితం ఆయన పుట్టినరోజు సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్వయంగా వారి ఇంటికి వెళ్లి బర్త్‌డే వేడుకల్లో పాల్గొన్నారు.

కేక్‌ కట్‌చేసి శుభాకాంక్షలు తెలిపారు. అస్వస్థతకు గురైన బొజ్జలను అపోలో ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో గుండెపోటు రావడంతో బొజ్జల మృతిచెందారు. గత కొంతలంగా అనారోగ్యంతో బాధపడుతున్న బొజ్జల .. ఇంటికే పరిమితమయ్యారు. ఆయన శ్రీకాళహస్తి నుంచి 5సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అలిపిరి బాంబుదాడి ఘటనలో చంద్రబాబుతోపాటు గాయపడ్డారు.

బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం అత్యంత బాధాకరమన్నారు ఆపార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. బొజ్జల అనునిత్యం ప్రజల్లోనే ఉండేవారని... సమస్యలపై వెంటనే స్పందించేవారన్నారు. బొజ్జల మరణం టీడీపీకి తీరని లోటని అన్నారు. బొజ్జల ఆత్మకు శాంతి చేకూరాలని తెలిపారు. 

Tags:    

Similar News