Yuvagalam: నారా లోకేష్‌కు అస్వస్థత
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు;
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. లోకేష్‌ను పరీక్షించిన వైద్యులు.. రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అనారోగ్యంతో ఉన్నా పాదయాత్రకు కొనసాగిస్తానని లోకేష్ ప్రకటించారు.
ఆరోగ్య సమస్యలున్నా పాదయాత్ర కంటిన్యూ చేస్తానని చెప్పారు లోకేష్. తన కంటే ఎక్కువగా ప్రజలు బాధల్లో ఉన్నారని.. వారికి భరోసా ఇవ్వడం ముఖ్యమన్నారు. సాయంత్రం 4 గంటలకు జమ్మలమడుగు నుంచి లోకేష్ పాదయాత్ర తిరిగి ప్రారంభం కానుంది. సాయంత్రం జమ్మలమడుగు సభలో లోకేష్ పాల్గొంటారని టీడీపీ నేతలు తెలిపారు.