మే 2న అమరావతిలో ఓ పెద్ద పండుగ జరుగనుందన్నారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. రాజధాని పునర్నిర్మాణ కార్యక్రమాన్నికి ఎమ్మెల్యే హోదాలో మాజీ సీఎం జగన్ హాజరు కావాలని కోరారు. గత ప్రభుత్వంలో ఏపీకి రాజధాని ఏదని పక్క రాష్ట్రాల ప్రజలు హేళన చేసేవారని గుర్తు చేశారు. అమరావతి రైతుల్ని, మహిళలను వైఎస్ జగన్ దారుణంగా హింసించాడని అన్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం చేయబోయే అభివృద్ది పనుల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున హాజరుకావాలని ఏపీ ప్రజలకు ఆదిరెడ్డి విజ్ఞప్తి చేశారు.