టీటీడీ ఈవో ధర్మారెడ్డి సెలవు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు కోరినా ఈవో ధర్మారెడ్డికి వారం రోజుల సెలవు మంజూరు చేశారు చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్.. అయితే సెలవు సమయంలో రాష్ట్రం దాటి వెళ్లవద్దని కండిషన్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ వ్యవహారాల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలున్నాయి.
అయితే ఇటీవల వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయి.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో టీటీడీ ఈవోకు కండిషన్‌పై బెయిల్ మంజూరు చేసినట్టు తెలుస్తోంది.