Vasireddy Padma : వచ్చే వారం టీడీపీలో చేరుతా: వాసిరెడ్డి పద్మ

Update: 2024-12-08 07:15 GMT

తాను వచ్చే వారం టీడీపీలో చేరనున్నట్లు రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. ఇవాళ ఎంపీ కేశినేని చిన్నితో ఆమె భేటీ అయ్యారు. అనంతరం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు. మరో వారం రోజుల తరువాత టీడీపీలో జాయిన్‌ అవుతానని ప్రకటించారు.ఆమె ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సైతం టీడీపీలో కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. ఈనెల 9న ఆయన ఆ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ ఆయన చేరికను పలువురు టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఆళ్లనానిని తీసుకుంటే జరుగబోయే పరిణామాల గురించి వాకబు చేస్తోంది. ఆళ్లనానిని వ్యతిరేకిస్తున్న వారిని బుజ్జగించే పనులను నియోజకవర్గానికి చెందిన కీలక నేతకు బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు శాంతిస్తే ఆళ్లనాని రాక సులభతరం అవుతుందని భావిస్తున్నారు

Tags:    

Similar News