CM Chandrababu Warning : బాబు వార్నింగ్.. మళ్లీ పరదాలు కనబడితే సస్పెండ్ చేస్తా
ఏపీ సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) మరోసారి పోలీసుల తీరుపై ఫైరయ్యారు. గత సీఎం ఎక్కడికి వెళ్లినా పరదాలు కట్టుకుని వెళ్లారనీ.. మురికి కాల్వ కూడా కనబడకుండా తెరలు కట్టారునీ.. సమస్యలు దాస్తే దాగవన్నారు. గుంటూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ ప్రోగ్రామ్ లో లోకేశ్ తో కలిసి పాల్గొన్నారు.
"నేను వెళ్లేదారుల్లో పరదాలు కట్టినట్లు మళ్లీ కనబడితే సస్పెండ్ చేస్తా. అధికారులు కూడా పాతరోజులు మర్చిపోయి కొత్త రోజుల్లోకి రావాలి. పరదాలు కట్టాలన్న ఆలోచన వస్తే ఇక షాక్ ట్రీట్ మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. చెప్పిన దాని ప్రకారం నడుచుకోకపోతే మళ్లీ 1995 నాటి సీఎంను చూస్తారు. ఎప్పుడూ జరగని అభివృద్ధిని మంగళగిరి నియోజకవర్గంలో చేసి చూపిస్తాం. రోడ్లు వేసేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉంటే మాతో చెప్పండి...కోర్టులకు వెళితే పనులు ఆలస్యమవుతాయి. రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు అమలు చేయడానికి... పేదరికం లేని సమాజానికి పెనుమాక నుండే సంకల్పం తీసుకుంటున్నాం. కొన ఊపిరి వరకూ ప్రజల కోసమే పోరాడుతా" అని సీఎం చంద్రబాబు అన్నారు.