AP : క్వాంటమ్ టెక్నాలజీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

Update: 2025-09-05 15:15 GMT

న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన నమ్మకం ఉందని, ఇది అత్యంత ముఖ్యమైనదని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఈ సదస్సును ఏసీఐఏఎం, భోపాల్ నేషనల్ లా యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, మధ్యవర్తిత్వం ద్వారా సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని అన్నారు. ప్రజలు న్యాయం పొందడం తమ హక్కుగా భావించి కోర్టులకు వస్తుంటారని పేర్కొన్నారు.

క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు:

నూతన సాంకేతికత వినియోగంలో భారత్ వేగంగా పురోగమిస్తోందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయబోతోందని, ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, ఎకో సిస్టమ్‌ను తీసుకురావడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని సీఎం స్పష్టం చేశారు.

Tags:    

Similar News