YS Jagan : జగన్ ను అడ్డుకుంటాం.. దళిత సంఘాల వార్నింగ్..

Update: 2025-10-08 15:30 GMT

మాజీ సీఎం వైఎస్ జగన్ ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. జగన్ పర్యటనలో చాలా రకాల సంఘటనలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్రం పరిస్థితి ఎలా ఉన్నా పట్టించుకోకుండా.. తనకు అవసరం అయిన టైమ్ లో వచ్చి ఏదో ఒక వివాదం సృష్టించి వెళ్లడం జగన్ కు అలవాటు అయిపోయింది. ఇప్పుడు మరోసారి నర్సీపట్నంలో రోడ్ షో చేసేందుకు వస్తున్నాడు జగన్. ఈ విషయం తెలియడంతో దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే ఇదే నర్సీపట్నంకు చెందిన డాక్టర్ సుధకార్ కరోనా సమయంలో మాస్కులు, పీపీఈ కిట్లు అడిగినందుకు.. ఎంత దారుణంగా పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందో గుర్తు చేస్తున్నారు.

ఆయన మీద కావాలనే పిచ్చివాడు అనే ముద్ర వేయించి.. ఆయన్ను అత్యంత దారుణంగా టార్గెట్ చేసి చివరకు ఆయన ప్రాణాలు విడిచేలా చేసిన దురదృష్టకర ఘటనను ఇప్పుడు దళిత సంఘాలు గుర్తు చేస్తున్నాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కనీసం సుధాకర్ కుటుంబం గురించి ఆరా తీసిన పాపాన పోలేదు. వాళ్లను పట్టించుకోలేదని దళిత సంఘాలు అంటున్నాయి. కాబట్టి ముందుగా నర్సీపట్నంలోని సుధాకర్ కుటుంబానికి క్షమాపణలు చెప్పి ఆ తర్వాత రోడ్ షో చేయాలని వార్నింగ్ ఇస్తున్నాయి. లేదంటే జగన్ పర్యటనను అడ్డుకుంటామని వాళ్లు తేల్చి చెబుతున్నారు. ఈ మేరకు కొన్ని దళిత సంఘాలు వరుసగా ప్రెస్ మీట్లు నిర్వహించాయి. జగన్ ఏం ముఖం పెట్టుకుని నర్సీపట్నం వస్తున్నాడంటూ ఏకిపారేస్తున్నారు దళిత సంఘాల నేతలు.

మెడికల్ కాలేజీ కన్ స్ట్రక్షన్ పేరుతో జగన్ వచ్చి రాజకీయాలు చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఒక డాక్టర్ నే కాపాడలేని జగన్.. ఇప్పుడు వచ్చి మెడికల్ కాలేజీ కట్టేసి డాక్టర్లను చదివిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు అని దళిత సంఘాలు అంటున్నారు. అసలు జీవోనే లేకుండా కాలేజీ ఎలా నడుస్తుందని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అంత చిత్తశుద్ధి ఉంటే అధికారంలో ఉన్నప్పుడే మీరు మెడికల్ కాలేజీలను పూర్తి చేసి విద్య అందించేలా చూసి ఉండొచ్చు కదా.. కానీ తొమ్మిదేళ్లు పడుతుంది అన్నట్టు ప్రగల్బాలు పలకడం ఎందుకు అని ఏకిపారేస్తున్నారు దళిత నేతలు. వైసీపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు సానుభూతి పర్యటనలు ఏంటని అడుగుతున్నారు.

Tags:    

Similar News