మంత్రి నారా లోకేష్ ఎంత డెడికేషన్ తో పనిచేస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ఒక పని పని అప్పగిస్తే దానిపై నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఇప్పుడు ఆయన ఐటీ మినిస్టర్ గా ఉండి.. ఏపీకి ఎలా పెట్టుబడులు తీసుకురావాలా అని ఎల్లప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. ఏ వేదిక ఎక్కినా, ఏ ఈవెంట్ కు వెళ్లినా, ఏ దేశానికి వెళ్లినా సరే పెట్టుబడులు పెట్టాలని ఆయా కంపెనీలను అడుగుతూనే ఉంటారు. ఇదే ఆయన పని తనానికి నిదర్శనం అని చెప్పుకోవాలి. ప్రపంచంలోనే గూగుల్ అతిపెద్ద పెట్టుబడి ఏపీలో పెడుతోందంటేనే ఆయన పనితనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటనలో చాలా బిజీగా ఉన్నారు లోకేష్.
వాస్తవానికి ఆయన వెళ్లింది పెట్టుబడుల కోసం కాదు. అక్కడ వేరే ప్రోగ్రామ్స్ లలో పాల్గొనేందుకు వెళ్లారు. కానీ అక్కడకు వెళ్లాక కూడా రెస్ట్ లేకుండా పెట్టుబడుల కోసం తిరుగుతున్నారు. ఆస్ట్రేలియా-ఇండియా సీఈవో ఫోరం డైరెక్టర్ మెక్ కేతో భేటీ అయ్యారు. ఆస్ట్రేలియా-ఇండియా స్టేట్ ఎంగేజ్‌మెంట్ అజెండాలో ఏపీని చేర్చాలని కోరారు. ఆస్ట్రేలియా-ఏపీ సీఈవో రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇవ్వాలన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలంటూ ఆమెను కోరారు. ఏపీకి ఉన్న ప్రత్యేకతలు, తీర ప్రాంతం, తమ ప్రభుత్వం కల్పిస్తున్న వెసలుబాట్ల గురించి నారా లోకేష్ ప్రత్యేకంగా ఆమెకు వివరించారు. ఆమె కూడా సానుకూలంగానే స్పందించింది.
ఎంత డెడికేషన్ ఉన్న లీడర్ కాకపోతే.. తాను వెళ్లిన షెడ్యూల్ లో పెట్టుబడులు అనే అంశం లేకపోయినా సరే ఇంతగా కష్టపడుతాడు. వాస్తవానికి తనకెందుకులే అని మిగతా రాష్ట్రాల మంత్రుల లాగా లైట్ తీసుకోవచ్చు. గూగుల్ డేటా సెంటర్ వచ్చేసింది ఇంకా ఏం కష్టపడుతాం లే అని అనుకోవచ్చు. కానీ లోకేష్ అలా అస్సలు ఆలోచించట్లేదు. ఇంకా పెద్ద కంపెనీలు వచ్చి ఏపీలో పెట్టుబడులు పెట్టాలని బలంగా ఆలోచిస్తున్నారు. రాబోయే ఐదేళ్లలో ఏపీ ముఖచిత్రమే మారిపోవాలని తెగ ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగానే ఏ కంపెనీ అయినా సరే పెట్టుబడి పెడుతుంది అంటే ఆయనే స్వయంగా వెళ్లి కలిసి మాట్లాడుతున్నారు. వాళ్లను ఒప్పిస్తున్నారు. ఇది కదా సమర్థవంతమైన నాయకత్వం అంటున్నారు ఏపీ యువత.