Gudivada Amar Nath : కులాల మధ్య వైసీపీ చిచ్చు.. ఇంకెన్నాళ్లీ అరాచకం..

Update: 2025-10-18 05:15 GMT

ఏపీలో కూటమి దూసుకుపోతోంది. ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలను తీసుకొచ్చి మూడు ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తోంది. దేశమంతా ఏపీ అభివృద్ధి గురించే మాట్లాడుకుంటోంది. అటు సంక్షేమానికి అసలే లోటు లేదు. రెండింటినీ బ్యాలెన్స్ గా తీసుకెళ్తుండటంతో పాటు ఏపీకి అమరావతి రాజధానిగా స్పీడ్ గా నిర్మాణం అవుతోంది. దీంతో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతోంది. కూటమి మధ్య ఎలాంటి గొడవలు, వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇంకో పదిహేనేళ్లు ఉంటామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ చెబుతున్నారు. దీంతో వైసీపీ బ్యాచ్ కు నిద్ర పట్టట్లేదు. ఈ కూటమిని ఎలాగైనా విడదీయాలని తెగ ప్రయత్నాలు చేసేస్తున్నారు.

అందులో భాగంగానే కులాల మధ్య చిచ్చు పెడితే ఎలా ఉంటుందనే ప్లాన్లు వేస్తున్నారు. అందుకే అవసరం లేకపోయినా సరే కావాలనే వంగవీటి రంగా పేరును తెరమీదకు తెస్తున్నారు. మాట మాట్లాడితే చాలు వంగవీటి రంగాను చంపిన పార్టీ అంటూ టీడీపీ మీద బురదజల్లే కుట్రలు చేస్తోంది వైసీపీ పార్టీ. గుడివాడ అమర్ నాథ్ పదే పదే ఈ మాటలు చెబుతూ కాపులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వంగవీటి రంగా హత్య ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అప్పట్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే విచారణ చేయలేదు. ఆ తర్వాత నిజాలు తెలుసుకుని రంగా ఫ్యామిలీ టీడీపీలో చేరింది. గుడివాడ అమర్ నాథ్ తల్లి కూడా టీడీపీలో చేరారు.

ఇప్పుడు రంగా కొడుకు రాధాకృష్ణ కూడా టీడీపీలోనే ఉన్నారు. వాళ్లందరూ టీడీపీవైపే ఉంటే.. అమర్ నాథ్ మాత్రం ఇప్పుడు లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తూ కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి కలిసి ఉండటాన్ని, ఏపీ అభివృద్ధిని, సీఎం చంద్రబాబు, పవన్ ఇమేజ్ పెరగడాన్ని చూసి ఓర్చుకోలేకపోతున్నారు. కూటమిని విడదీసేసి అర్జెంటుగా ఏపీలో జగన్ ను సీఎంను చేసేందుకు ఎన్ని రకాల కుట్రలు చేయాలో అన్నీ చేసేస్తున్నారు. కానీ కూటమి మాత్రం ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు వద్దు అంటోంది. అందరం కలిసి ఏపీని అభివృద్ధి చేద్దాం అని చెబుతోంది. ప్రపంచమంతా అభివృద్ధివైపు వెళ్తుంటే ఇంకా కులం పేరుతో, మతం పేరుతో గొడవలు అవసరమా అని ప్రశ్నిస్తోంది. ఏపీకి ఇప్పుడు కావాల్సింది డెవలప్ మెంట్, రాజధాని నిర్మాణం అని గుర్తు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కూటమి తప్పు చేస్తే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ ప్రశ్నించాలి అందులో తప్పు లేదు గానీ.. ఇలాంటి కుట్రలు వద్దు అని చంద్రబాబు సూచిస్తున్నారు. అది కదా నిజమైన నాయకత్వం అంటే.

Tags:    

Similar News