సీఎం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ ఈడీ కోర్టు కీలక నిర్ణయం
సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ;
సీఎం జగన్ ఆస్తుల కేసులో సీబీఐ ఈడీ కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీబీఐ కేసులతో సంబంధం లేకుండా ఈడీ కేసుల విచారణ జరపాలని నిర్ణయించింది. సీబీఐ ఛార్జ్‌షీట్లు తేలిన తర్వాతే.. ఈడీ కేసుల విచారణ జరపాలని జగన్ తరపు న్యాయవాది కోరారు.
ఐతే.. జగన్ వాదనను సీబీఐ ఈడీ కోర్టు తోసిపుచ్చింది. సీబీఐ, ఈడీ ఛార్జ్‌షీట్లలో నేరాభియోగాలు వేర్వేరని పేర్కొంది. ఈడీ కేసులు ముందుగా విచారణ చేపడతామని స్పష్టం చేసింది. కేసు ఈనెల 21కి వాయిదా వేసింది.