YS Jagan: వైఎస్ జగన్ కొత్త ప్లాన్.. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్..
YS Jagan: వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే అందరూ తీవ్రంగా శ్రమించాల్సిందేనన్నారు సీఎం జగన్.;
YS Jagan: వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే అందరూ తీవ్రంగా శ్రమించాల్సిందేనన్నారు సీఎం జగన్. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశమైన జగన్.. వచ్చే రెండేళ్లు ఏం చేయాలన్న దానిపై దిశా నిర్దేశం చేశారు. 26 జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, మంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. మంత్రులు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు అంతా సమానమేనని.. సంక్షేమ పథకాలపై గడప గడపకు వెళ్లి వివరించాలని సీఎం చెప్పారన్నారు. పార్టీ పటిష్టతే ధ్యేయంగా ప్రతీ ఒక్కరూ పని చేయాల్సిందే అని జగన్ తేల్చి చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు టార్గెట్‌గా పనిచేయాలని సూచించారు.