ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM Jagan) నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ శనివారం ప్రకటించింది. కడప జిల్లా ఇడుపులుపాయలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధి వద్ద అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.
బాపట్ల ఎంపీ నందిగాం సురేష్ లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల పేర్లను చదవగా, దేవాదాయ శాఖ మంత్రి డి.ప్రసాదరావు అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల పేర్లను చదివి వినిపించారు. ఈ జాబితా ప్రకారం, బి ఝాన్సీ లక్ష్మి విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటీ చేయనుండగా, జి ఉమా బాల నరసాపురం అభ్యర్థిగా మరియు వి విజయసాయి రెడ్డి నెల్లూరు నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్‌ఎస్‌లో ఇప్పుడు ఫిరాయింపుల పర్వం మొదలైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన నాగర్‌కర్నూల్ (ఎస్సీ) ఎంపీ పోతుగంటి రాములు, జహీరాబాద్ (ఎస్సీ) ఎంపీ బీబీ పాటిల్, అలాగే మాజీ ఎంపీలు సీతారాం నాయక్, గోడం నగేశ్, మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్ రావు ఇటీవలి వారాల్లో బీజేపీలోకి మారారు. జహీరాబాద్, నాగర్‌కర్నూల్ ఎంపీలు తమ సిట్టింగ్ నియోజకవర్గాల నుంచి మళ్లీ పోటీ చేసేందుకు బీజేపీ టిక్కెట్లు ఇచ్చింది. ఊహించినట్లుగానే ప్రస్తుత ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.