ఆస్ట్రియాకు చెందిన కేటీఎంలో మెజార్టీ వాటాను బజాజ్ ఆటో కొనుగోలు చేసింది. బజాజ్ ఆటో ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ బీవీ ద్వారా 800 మిలియన్ యూరోలు (సుమారు 7,765 కోట్లు) తో మెజార్టీ వాటాను కొనుగోలు చేసినట్లు బజాజ్ ఆటో తెలిపింది. కేటీఎంలో ఇప్పటికే బజాజ్ ఆటో వాటాదారుగా ఉంది. దీంతో కేటీఎంలో మెజార్టీ వాటాతో సంస్థ బజాజ్ ఆటో ఆధీనంలోకి రానుంది. ఆర్ధిక సంక్షోభంలో ఉన్న కేటీఎం పునర్ని ర్మాణానికి ఈ కొనుగోలు సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ డీల్తో ప్రపంచ మోటార్ సైకిల్ మార్కెట్లో బజాజ్ ఆటో పరిధిని విస్తరించనుంది. ఇండియాలో బజాజ్ ఇప్పటికే కేటీఎం బైక్ లను విక్రయిస్తోంది. వాటా కొనుగోలులో భాగంగా డీల్ విలువ 7,765 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. ప్రస్తుతం కేటీఎంలో బజాజ్ ఆటోకు 49.9 శాతం వాటా ఉంది. ఈ డీల్ తరువాత కేటీఎం వాటా 37.5 శాతానికి తగ్గనుంది.