Flipkart New Deal : భారతీయ టాయ్స్ కోసం ఫ్లిప్‌కార్ట్ కొత్త ఒప్పందం

Update: 2024-06-13 07:25 GMT

భారత్ ను బొమ్మల తయారీ కేంద్రంగా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ( Flipkart ) భాగస్వామిగా చేరింది. ఈ మేరకు డిపార్టుమెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ ఆండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డీపీఐఐటీ)తో సప్లయ్ చైన్లో ఫ్లిప్ కార్ట్ ఒక వర్క్ షాప్ నిర్వహించింది.

ఇందులో పెద్ద సంఖ్యలో బొమ్మల తయారీ దారులు పాల్గొన్నారు. అత్యంత నాణ్యమైన బొమ్మల తయారీ చేయడానికి వీరికి శిక్షణ ఇచ్చేందుకు దీన్ని నిర్వహించారు. దేశాన్ని బొమ్మల తయారీ కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్ఏపీటీ) రూపకల్పనతో సహా అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది.

బొమ్మల తయారీ దారుల వ్యాపారాలను ఆన్లైన్లో వృద్ధి చేయడంతో ఫ్లిప్ కార్డ్సహయపడుతుంది. ఈ కార్యక్రమంలో డీపీఐఐటీ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్, జాయింట్ సెక్రటరీ సంజీవ్. ఫ్లిప్ కార్డ్ చీఫ్ కార్పోరేట్ ఆఫైర్స్ ఆఫీసర్ రజనీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News