Actress Hema : నటి హేమకు బెయిల్

Update: 2024-06-13 06:14 GMT

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన నటి హేమకు ( Actress Hema ) బెయిల్ మంజూరైంది. బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్‌ లేవని, ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో తెలిపారు. అంతేకాకుండా హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి ఆయన తీసుకువెళ్లారు.

అయితే, హేమ రేవ్‌ పార్టీలో పాల్గొన్నట్లు అందుకు సంబంధించిన ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు అందించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో భాగంగా హేమ పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. బెయిల్ రావడంతో రేపు జైలు నుంచి బయటకి రానున్నారు.

Tags:    

Similar News