బెంగళూరు రేవ్ పార్టీ కేసు దర్యాప్తులో భాగంగా ఇవాళ పాల్గొన్నవారిని విచారణకు పిలిచారు అక్కడి పోలీసులు. ఐతే.. ఈ విచారణకు టాలీవుడ్ నటి హేమ హాజరు కాలేదు. బెంగుళూరు రేవు పార్టీ కేసు విచారణకు హాజరు కానని ఇంతకుముందే చెప్పిన హేమ అన్నంతపనిచేసింది.
తాను అబద్దం ఆడననీ.. అందుకే హ్యాపీ గా ఉంటాను అంటున్నారు హేమ. రేవ్ పార్టీ కేసులో ఆరోపణలు ఎదురుకుంటున్న హేమ... విచారణకు హాజరయ్యేందుకు గడువు కోరినట్టు సమాచారం. తాను వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నానని బెంగళూరు పోలీసులకు హేమ లెటర్ రాసినట్టు తెలిసింది.
హేమ లేఖను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు మరో నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. తర్వాత విచారణకైనా హాజరుకావాలని కోరనున్నారు.