కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన అపరిచితుడు మూవీ రీరిలీజ్ అవుతోంది. ఈ సినిమాను ఈ నెల 17న రీరిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో సదా హీరోయిన్‌గా నటించారు. ప్రకాశ్ రాజ్, వివేక్, నాజర్ కీలక పాత్రలు పోషించారు. హారిస్ జయరాజ్ సంగీతం అందించారు. జూన్ 17, 2005లో ఈ సినిమా విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఈ చిత్రంలో విక్రమ్ నటన చిరస్థాయిగా నిలిచిపోతుంది. అప్పటికి సదా సినిమాల్లోకి కొత్తే అయినప్పటికీ ఆమె కూడా తన పాత్ర మేరకు అద్భుతంగా నటించింది. విక్రమ్ తో కెమిస్ట్రీ సూపర్బ్ గా పండించింది. సాంగ్స్ లో సదాని శంకర్ గ్లామరస్ గా చూపించారు. రాము, రెమో, అపరిచితుడు మధ్య నలిగిపోయే అమ్మాయిగా సదా చాలా బాగా నటించింది. రెమో తో లవ్ సీన్స్ లో ఎంతో అందంగా మెప్పించింది.