వైవిధ్యమైన చిత్రాలకు, విభిన్నమైన కథలకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తుంటారు. ఆ కోవలోనే రూపొందుతున్న డివోషనల్ థ్రిల్లర్ చిత్రం 'షణ్ముఖ'. పవర్ ఫుల్ టైటిల్తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ కథానాయకుడు. అవికాగోర్ ( Avika Gor ) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి షణ్ముగం సాప్పని దర్శకుడు.
శాసనసభ అనే పాన్ ఇండియా చిత్రంతో అందరికి సుపరిచితమైన సంస్థ సాప్ట్ ప్రొడక్షన్స్ సంస్థ తమ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్పని బ్రదర్స్ సమర్పణలో తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని, రమేష్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల జరిగిన చివరి షెడ్యూల్తో ఈ చిత్రం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న అవికాగోర్ పుట్టినరోజు సందర్భంగా చిత్రంలో ఆమె లుక్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ విడుదల చేశారు. పవర్ ఫుల్ రోల్ లో అవికాగోర్ యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్ర పోషిస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.