కమల్ హాసన్ హీరోగా నటించిన భారతీయుడు మూవీ రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషల్లో జూన్ 7న రీరిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో మనీషా కోయిరాలా, ఊర్మిళ హీరోయిన్లుగా నటించారు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం అప్పట్లో పలు రికార్డులు బద్దలుకొట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘భారతీయుడు 2’ కూడా జులై 12న విడుదల కానుంది.
1996లో శంకర్ దర్శకత్వంలో విడుదలైన 'భారతీయుడు' చిత్రంలో సేనాపతి పాత్రలో కమల్ దుమ్మురేపాడు. ఆ పాత్రలో ఆయన చూపిన ఆహార్యం, హావభావాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకోవడం చట్ట విరుద్ధం అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎప్పటికీ మరిచిపోలేము. అయితే, భారతీయుడు చిత్రాన్ని జూన్ 7న తెలుగు,తమిళంలో రీ-రిలీజ్ చేస్తున్నారు. నేడు ట్రైలర్ కూడా విడుదల కానుంది.
ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించగా.. జీవా సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అలాగే బి లెనిన్, వి.టి విజయన్ లు ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎ.ఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మించారు. 15 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమాను 1996 మే 9వ తేదీన గ్రాండ్ గా విడుదల చేశారు. ఇలా అద్భుతమైన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కేవలం సినిమా మాత్రమే కాదండోయ్.. అందులోని పాటలు కూడా అదుర్స్ అనిపించాయి.