Game Changer : గేమ్ ఛేంజర్ సీన్ లీక్

Update: 2024-05-07 06:52 GMT

శంకర్- రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ సీన్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా 'గేమ్ చేంజర్' సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. శంకర్ కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాత, రామ్ చరణ్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనపడనున్నారని తెలుస్తోంది.

ఒక పాత్రకి కియారా అద్వానీ కథానాయిక కాగా, ఇంకో పాత్రకి అంజలి కథానాయిక. ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులు వున్నారు. అందులో శ్రీకాంత్, ఎస్. జె. సూర్య, సునీల్, సముద్రఖని, జయరాం లాంటి వారు నటిస్తున్నారు. ఈ సినిమా మళ్ళీ వార్తల్లో వుంది. ఈసారి ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండగా ఈ సినిమా నుంచి లీకయిన సన్నివేశం ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

పంచె కట్టులో వున్న రామ్ చరణ్, శ్రీకాంత్ ని హగ్ చేసుకుంటూ వున్న సన్నివేశం లీకయింది. మెగా అభిమానులు ఈ సన్నివేశం చూసి, ఇది థియేటర్ లో అయితే అదిరిపోతుంది అని సామాజిక

మాధ్యమాల్లో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. మామూలుగా పెద్ద సినిమాలు చిత్రీకరణ జరుగుతున్నప్పుడు మొబైల్ ఫోన్స్ సెట్ పైకి తీసుకెళ్లనివ్వరు. కానీ మరి ఈ సన్నివేశం ఎలా లీకయిందో కూడా అర్ధం కావటం లేదు అని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. కొన్నిసార్లు లీక్స్ తో ప్రమోషన్ కొడుతుంటారు. ఇది కూడా స్ట్రాటజీలో భాగమేనని ఓ వర్గం అంటోంది.

Tags:    

Similar News