పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ‘కల్కి’ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. నిన్న రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఒక్కరోజులోనే రూ.191.5 కోట్లు (నెట్) వసూలు చేసింది. దీంతో RRR, బాహుబలి-2 తర్వాత ఎక్కువ కలెక్షన్లు వచ్చిన సినిమాగా నిలిచింది. అయితే, నార్త్ అమెరికాలో తొలిరోజు $5.5 మిలియన్ల కలెక్షన్లతో ఆల్ టైమ్ రికార్డు కలెక్షన్లు కైవసం చేసుకుంది.
‘కల్కి 2898ఏడీ’ సినిమాలో నటించాలని మూవీ టీం తన వద్దకు రాగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పానని మృణాల్ ఠాకూర్ తెలిపారు. ‘నిర్మాతలు అశ్వినీ దత్, స్వప్న, ప్రియాంకతో నేను సీతారామం చేశాను. వారి అభిరుచిపై నాకు చాలా నమ్మకముంది. అందుకే ఇలాంటి భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం అనగానే ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చేసేశా’ అని పేర్కొన్నారు. నిన్న విడుదలైన ‘కల్కి 2898ఏడీ’ బ్లాక్‌బస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
‘కల్కి’ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన వేళ నిర్మాత స్వప్న దత్ Xలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. ‘నాకు కాల్ చేసి రికార్డ్స్ క్రాస్ చేశామా అని చాలా మంది అడుగుతున్నారు. నాకు నవ్వొస్తుంది. ఎందుకంటే ఆ రికార్డులు సృష్టించిన వాళ్లెవరూ ఆ రికార్డుల కోసం సినిమాలు తీయలేదు. ప్రేక్షకుల కోసం, సినిమా మీద ప్రేమతో సినిమాలు తీస్తారు. మేము కూడా అలాగే తీశాం’ అని ఆమె పోస్ట్ చేశారు. ‘కల్కి’ మూవీ ఎలా ఉందో కామెంట్ చేయండి.