'కల్కి’ సినిమాతో వరల్డ్ వైడ్‌గా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు ప్రభాస్. ప్రస్తుతం ఆయన ‘రాజా సాబ్’ ‘ఫౌజీ’ చిత్రాలను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ సినిమా షూట్ లో జాయిన్ కానున్నారు. ‘యానిమల్’ వంటి సంచలన సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగా నుండి వస్తున్న సినిమా కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇదిలా ఉండగా తాజా ఇంటర్వ్యూలో ‘స్పిరిట్’ నిర్మాతల్లో ఒకరైన భూషణ్ కుమార్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. డిసెంబర్ నెలాఖరులో సినిమాను సెట్స్‌మీదకు తీసుకెళ్తామని, ఆరు నెలల వ్యవధిలో షూటింగ్‌ను పూర్తి చేస్తామని పేర్కొన్నారు. దాంతో వచ్చే దసరా కల్లా ‘స్పిరిట్’ విడుదలకు సిద్ధంగా ఉంటుందని అభిమానులు ఆంచనా వేస్తున్నారు.