Pushpa 2 : పుష్ప 2 టికెట్ రేట్లకు రెక్కలు

Update: 2024-11-19 12:15 GMT

పుష్ప-2 మూవీ టికెట్ రేట్లు భారీగా పెరగనున్నాయి. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప-2 మూవీపై ఇప్పటికే భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. దీంతో టికెట్ రేట్లను పెంచేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం APలో150-200 ఉన్న టికెట్ రేటును 300లకు పెంచేందుకు సర్కార్ ను చిత్ర యూనిట్ కలుస్తోంది. దీంతో ఏపీ సర్కార్ అనుమతిస్తే... పుష్ఫ-2 మూవీ టికెట్లు భారీగా పెరగనున్నాయి. ఇటు హైదరాబాద్ , తెలంగాణ జిల్లాల్లోనూ రేట్లు ఎక్కువగానే ఉండనున్నాయి. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ లో కనీసం రూ.300 మల్టీప్లెక్స్ లో రూ.500 ఉంటుందని టాక్ నడుస్తోంది. 

Tags:    

Similar News