Rajasaab : సంకాంత్రికి రాజాసాబ్ ఫస్ట్ సింగిల్

Update: 2024-11-26 13:15 GMT

కల్కి 2898 ఏడీ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న లేటెస్ట్ మూవీస్ సలార్ 2, రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్ మూవీని టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ కానున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ ఫీమేల్ లీడ్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావచ్చిందని మేకర్స్ తెలిపారు. మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసేందుకు మేకర్స్ బిజిబిజీగా పనిచేస్తున్నారట. అయితే లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం ఈమూవీలో ఓ సాంగ్ షూటింగ్ కోసం వచ్చే నెలలో మూవీ టీమ్ యూరప్ వెళ్లనుందట. ప్రభాస్, మాళవిక మధ్య సాగే డ్యూయెట్ అని తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఏప్రిల్ 10న ఈ మూవీ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. ఇక వచ్చే సంక్రాంతికి ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Tags:    

Similar News