Rakul Preet Singh : పెళ్లి తర్వాత బంపరాఫర్ కొట్టేసిన రకుల్

Update: 2024-03-06 06:08 GMT

రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) రీసెంట్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. నిర్మాత జాకీ భగ్నానీని ఆమె ప్రేమించి వివాహం చేసుకుంది. కొత్తగా పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీకి.. బాలీవుడ్ లో ఓ మంచి అవకాశం దక్కింది. స్టార్ హీరోతో సీక్వెల్ సినిమాలో యాక్ట్ చేసే చాన్స్ వచ్చింది. అజయ్ దేవగణ్, టబు, రకుల్ ప్రీత్ సింగ్ న టించిన సినిమా 'దేదే ప్యార్ దే`. భిన్నమైన కథాంశంతో వచ్చిన ఈ సినిమా.. బాలీవుడ్ లో మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ప్రేక్ష కులను బాగా ఆకట్టుకుంది. దీంతో దీనికి సీక్వెల్ ను నిర్మించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అదే టీమ్ తో ఈ సినిమాను రూపొందించేందుకు రెడీ అవుతున్నారు. దేదే ప్యార్ దే2 లో ర కుల్ పాత్ర మ రింత ఎంగేజింగ్ గా ఉంటుందని యూనిట్ వ ర్గాలు అంటున్నాయి. ఈ సినిమాకు రకుల్ ను ఎంచుకోవడానికి మరో కారణం ఉందట.

కొత్త గా పెళ్లైన హీరోయిన్ అయితే ఇందులోని ఓ పాత్ర కు పక్కాగా సూట్ అవుతుందట. భార్యాభర్తలకు మాత్రమే తెలిసిన కొన్ని విష యాలు రకుల్ పాత్రకు అవసరం పడుతున్నాయట. అందుకే కొత్తగా పెళ్లి చేసుకున్న రకుల్ ను దేదే ప్యార్ దే సీక్వెల్ కోసం మళ్లీ తీసుకున్నారట.

Tags:    

Similar News