ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను హీరోయిన్ గా మెప్పించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా (Rashi Khanna). ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు రాశి ఖన్నాకు నటిగా పేరు తెచ్చింది. టాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించాలంటే సన్నగా నాజూకుగా ఉండాలి. ఆ విషయాన్ని పట్టిన రాశి ఖన్నా కష్టపడి చాలా బరువు తగ్గింది. తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
తనకు ఇండస్ట్రీలో ఒక కల ఉందని, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో పనిచేయాలని ఉందని చెప్పుకొచ్చారు. నేనే కాదు దాదాపు అందరు హీరోయిన్స్ కూడా ఆయన దర్శకత్వంలో ఒక్కసారి అయినా నటించాలని కోరుకుంటారంటోంది. ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి ఉండే ప్రాధాన్యమే వేరంటోంది.
ఆడవారిని గొప్పగా చూపించే దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ముందుంటారని చెబుతోంది రాశీఖన్నా. విమర్శకులు సైతం మెచ్చుకునేలా ఆయన సినిమాలుంటాయని తెలిపింది. అలాంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో నటించడం అనేది నా కల అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది.