Rashmika Step Viral : పుష్ప2 రొమాంటింగ్ సాంగ్ వస్తోంది

Update: 2024-05-24 09:43 GMT

ఇటీవలే పుష్ప పుష్ప పుష్ప రాజ్ అంటూ తొలి లిరికల్ సాంగ్ తో ప్రపంచవ్యాప్త మూవీ లవర్స్ ను అలరించింది పుష్ప 2 టీమ్. యూట్యూబ్ వ్యూస్ ఆల్ టైమ్ రికార్డులు నెలకొల్పిన పుష్ప-2 ది రూల్ లోని పుష్పరాజ్ టైటిల్ సాంగ్ ఇంకా అంతటా మారుమోగుతూనే వుంది.

ఇప్పుడు తాజాగా మరో లిరికల్ అప్డేట్ ను ఇచ్చారు పుష్-2 మేకర్స్. ఈ సారి చిత్రంలోని హీరోయిన్ శ్రీవల్లి వంతు వచ్చింది. పుష్పరాజ్ జోడి అయిన శ్రీవల్లి పుష్పరాజ్ తో కలిసి పాడుకున్న మెలోడీ కపుల్ సాంగ్ ను నెల 29న విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది.

ప్రోమోలో కేశవ తన వాయిస్ తో సెకండ్ సాంగ్ గురించి రష్మికను అడుగుతాడు. మేకప్ వేసుకుంటున్న శ్రీవల్లి డీటెయిల్స్ ఇస్తుంది. సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ అంటూ ఆమె పాడుతూ అల్లు అర్జున్ ఐకానిక్ స్టెప్పు వేస్తుంది. ఈ ప్రమోషనల్ బిట్ కూడా ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. ఫుల్ సాంగ్ ఇంకెంత రచ్చచేస్తుందో చూడాలి.

Tags:    

Similar News