Allari Naresh : ఫస్ట్ టైం సీరియస్ మాస్ లుక్‌లో 'ఉగ్రం' నరేశ్

Update: 2024-07-01 07:50 GMT

హీరో అల్లరి నరేష్ ( Allari Naresh ) ఫ్యాన్స్ కు బర్త్ డే గిఫ్ట్ అదిరిపోయింది. అప్ కమింగ్ మూవీ 'బచ్చల మల్లి' ( Bachala Malli ) మేకర్స్ హీరో ఇంటెన్స్ క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ ఒక స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్ బస్టర్లను అందించిన హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా చాలా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

హీరో ఇంటి దగ్గర లౌడ్ స్పీకర్లో భగవద్గీత ప్లే చేయడంతో గ్లింప్స్ ఓపెన్ అవుతుంది, అది హీరో నిద్రకు భంగం కలిగిస్తుందని దానిని రిమూవ్ చేస్తాడు. తర్వాత లోకల్ బార్ లో స్టైల్ గా ఆల్కహాల్ సేవించి, అక్కడ ఉన్న గూండాలతో ఫైట్ చేసిన ఎపిసోడ్ అదిరిపోయింది. ఏయ్ ఎవడి కోసం తగ్గాలి... ఎందుకు తగ్గాలి' అంటూ అల్లరి నరేష్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ క్యారెక్టర్ మొండి వైఖరిని డిఫైన్ చేసింది.

Full View

అల్లరి నరేష్ మరోసారి మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. సీరియస్ మాస్ లుక్ ఇదే ఫస్ట్ టైం అని చెప్పొచ్చు. గ్లింప్స్ మాస్ అప్పీలింగ్ గా వుంది. ఇది పర్ఫెక్ట్ బర్త్ డే ట్రీట్ అంటున్నారు. 'సీతా రామం' చిత్రానికి మ్యూజిక్ ఇచ్చిన విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News