Vidya Balan : అందుకే సిగరెట్ తాగడం నేర్చుకున్నా : విద్యాబాలన్

Update: 2024-04-27 05:45 GMT

బెంగాలీ సినిమా భోలే థేకోతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విలక్షణ నటి విద్యాబాలన్. అనంతరం పరిణిత మూవీతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. అక్కడి నుంచి విభిన్న పాత్రలు, విలక్షణ సినిమాలతో ఆకట్టుకుంటు వస్తోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేస్తూ.. తనదైన శైలిలో రాణిస్తోంది. రీసెంట్ గా దో ఔర్ దో ప్యార్ అనే చిత్రంతో ఈ అమ్మడు అలరించింది. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యాబాలన్ తన జీవితంలో జరిగిన విషయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

డర్టీ పిక్చర్లో తాను స్మోక్ చేయాల్సి వచ్చిందని, ఊరికే తాగుతున్నట్లుగా నటిస్తే ఆ పాత్ర పండదని.. అందుకే సిగరెట్ తాగడం నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. ఆ సినిమా తర్వాత సిగరెట్లకు బాగా అడిక్ట్ అయినట్లు పేర్కొంది. రోజుకు రెండు, మూడు సిగరెట్లు కాలిస్తే కానీ మనసు శాంతించేది కాదని వివరించింది. ప్రస్తుతం సిగరెట్లు తాగడం లేదని తెలిపింది. తనకు సిగరెట్ల వాసన ఇష్టమని.. కాలేజీకి వెళ్లే రోజుల్లో బస్ స్టాప్ లో పొగతాగేవారి పక్కన కూర్చున్నప్పుడు ఆ పొగను ఆస్వాదించేదాన్ని అని పేర్కొంది.

విద్య తన బరువు గురించి నిరంతరం విరుచుకుపడాలనే ఆలోచనను పేల్చింది. కొత్త చిత్రానికి సైన్ అప్ చేసిన ప్రతిసారీ, దర్శకుడు ఆమెను కొన్ని కిలోలు తగ్గించమని ఎలా అడుగుతారో వెల్లడించింది. ఇంతకుముందు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నందున, తక్షణమే బరువు తగ్గడం చాలా అసాధ్యమని నటి వెల్లడించింది. అంతేకాదు, సినిమా కోసం బరువు తగ్గాలనే ఆలోచనను ఆమె విరుచుకుపడింది. దానిని హాస్యాస్పదంగా పేర్కొంది.

Tags:    

Similar News