Warangal : రూ. 100 కోసం లొల్లి.. యువకుడి దారుణ హత్య

Update: 2024-12-19 06:45 GMT

వరంల్ కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో బీహర్ యువకుడి మర్డర్ కలకలం రేపింది. రూ.100 అదనపు కూలీ కోసం కరీమాబాద యువకులు, బీహర్ యువకులతో గొడవకు దిగినట్లు తెలుస్తోంది. బీహరన్నుంచి ఇంటి నిర్మాణ పనులు చేయడానికి దిల్కుష్ కుమార్ (18) అతడి సోదరుడు దులాల్చంద్ తో పాటు మరికొందరు వరంగల్ కరీమాబాద వద్ద ఇంట్లో రేంట్కు ఉంటున్నారు. నిన్న రాత్రి కరీమాబాద్కు చెందిన అశోక్, ప్రశాంత్, నగేష్ అనే కూలీలకు, బీహర్ యువకుల మధ్య కీర్తి బార్ వద్ద గొడవ జరిగింది. ఈ క్రమంలో దూలాల్ చంద్ తన మిత్రులను వరంగల్ ల్వేస్టేషన్లో వదిలి వచ్చేసరికి తన తమ్ముడు దిల్కుష్ కుమార్ ఇంట్లో రక్తపు మడుగులో కని పించాడని పోలీసులకు తెలిపారు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం వరంగల్ ఎంజీఎం మా ర్చురీకి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. మద్యం మత్తలో హత్య చేసి ఉండవచ్చని పోలీసుల భావిస్తున్నారు. 

Tags:    

Similar News