Fraud : ఓజీ సినిమా పేరిట రూ.1.34 కోట్ల చీటింగ్

Update: 2025-03-07 06:45 GMT

సినిమా ప్రమోషన్స్ పేరిట మోసం చేస్తూ భారీగా డబ్బులు దోచుకుంటున్నారు. ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్ పేరుతో రూ.1.34 కోట్లను కాజేశారు. హైదరాబాద్ నగరంలోని ఛత్రినాక పరిధిలోని అరుందతి కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన స్నేహితులతో కలిసి సరదాగా పలుమార్లు గోవాలకు వెళ్లాడు. గత సవత్స రం అక్టోబరులో గోవాకి వెళ్లిన సదరు ఉద్యోగి బిగ్ డాడీ క్యాసినోకు వెళ్లగా అక్కడ శ్రీలంకకు చెందిన ఉదయ్జ్, వివేక్ లు పరిచయం అయ్యారు. తాము కొత్తగా రిలీజ్ అయ్యే తెలుగు సినిమాల ప్రమోషన్ ఈవెంట్స్ చేస్తామంటూ నమ్మబలికారు. కాగా అదే నెలలో గచ్చిబౌలిలోని ఓ హోటల్కు బస చేసిన ఉదయ్, వివేక్ హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్ ఉద్యోగిని పిలిపించి మాట్లాడారు. ఈక్రమంలో త్వరలో విడుదల కానున్న పవన్ కళ్యాణ్ చిత్రానికి ప్రమోషన్ చేసేందుకు అవకాశం వచ్చిందని, ఓజీ సినిమా డైరెక్టర్ సుజీత్ ఫొటోలను చూపిస్తూ నమ్మించారు. ఓజీ కంటే ముందు అమరన్ సినిమా ప్రమోషన్కు రూ.20 లక్షలు ఇస్తే వారం రోజుల్లో రెట్టింపు లాభాలు ఇస్తామని తేల్చిచెప్పారు. సైబర్ కేటుగాళ్లు ఉదయ్, వివేక్ మాటలు నమ్మిన సదరు ఉద్యోగి వారి ఖాతాలో రూ. 20 లక్షలు చేశాడు. కొద్ది రోజులకే అమరన్ సినిమా ప్రమోషన్ ఈవెంట్స్ లో భారీ లాభాలు వచ్చాయం నిందితులిద్దరూ రూ.25 లక్షలు ప్రైవేటు ఉద్యోగి ఖాతాలో జమ చేశారు. దీంతో వారిద్దరిపై నమ్మకంతో.. తర్వాత ఐదారు సినిమాలకు పెట్టుబడి పెంచాడు. ఇల్లు అమ్మి కోటి 34 లక్షలు వారికి ముట్టచెప్పాడు. మొదట ఐదు లక్షలు లాభం చూపించడంతో అత్యాశకు పోయాడు. ఆ తర్వాత నుంచి వారి ఫోన్లు స్విచ్చాఫ్ రావడంతో పోలీసులను ఆశ్రయించాడు.

Tags:    

Similar News