Blackmail and Harassment : ప్రేమ పేరుతో మోసం.. బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పలువురి అత్యాచారం

Update: 2024-05-16 06:54 GMT

ఆ బాలికను మాయమాటలతో ఓ యువకుడు ప్రేమలోకి దింపాడు. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు వీడియో తీశాడు. తర్వాత దాన్ని తన స్నేహితులకు పంపాడు. ఆ వీడియోను ఆసరాగా చేసుకుని వారు ఆ బాలికను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్‌ జిల్లా చొప్పదండి పరిధిలోని ఓ బాలికకు రెండేళ్ల క్రితం అదే పట్టణానికి చెందిన యువకుడు సోషల్‌ మీడియా ద్వారా పరిచయమై తర్వాత ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు.

వారు సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను తన స్నేహితులకు షేర్‌ చేయగా వారు ఆ వీడియోను బాలికకు చూపి బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలెట్టారు. తమకు లొంగకుంటే వీడియోను వైరల్‌ చేస్తామంటూ బెదిరించారు. ఒకరి తర్వాత ఒకరు బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. రెండేళ్లుగా బెదిరిస్తూ బాలికపై అత్యాచారం చేస్తున్నారు.

ఇటీవల వారి వేధింపులు ఎక్కువకావడంతో ఆ బాలిక కుటుంబసభ్యులకు చెప్పగా వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చొప్పదండి పోలీసులు పోక్సో కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఈ కేసులో నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారిలో మైనర్లు కూడా ఉన్నట్లు తెలిసింది.

Tags:    

Similar News