మంచిర్యాల జిల్లా భీమారం వద్ద బుధవారం కారు ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటనలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన జైపూర్ పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిశాయి. యువకుడి మరణం రోడ్డు ప్రమాదం కాదు.. హత్య అని నిర్ధారణ అయ్యింది. కారు నడిపిన సాయికుమార్‌కు మల్లేశ్ భార్యతో వివాహేతర సంబంధం ఉంది. ఈ నేపథ్యంలో కక్షతో మల్లేశ్‌ను చంపాలని సాయికుమార్ నిర్ణయించుకున్నాడు. బుధవారం మల్లేశ్ వెళ్తుండగా సాయికుమార్ కారుతో ఢీకొట్టాడు. రోడ్డు ప్రమాదమని పోలీసులను నమ్మించాడు. కారుతో ఢీకొట్టి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేల్చారు.