TG : లేడీ కానిస్టేబుల్ దారుణ హత్య..చంపింది తమ్ముడే

Update: 2024-12-02 17:00 GMT

ఓ మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురైంది. స్కూటీపై ఇంటినుంచి డ్యూటీకి బయల్దేరిన నిమిషాల వ్యవధిలో ఆమె సొంత తమ్ముడే కారుతో ఢీకొట్టి.. కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ లో ఇవాళ ఉదయం చోటు చేసుకుంది. రాయపోల్ గ్రామానికి చెందిన నాగమణి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. 2020 కానిస్టే బుల్ బ్యాచ్ కు చెందిన నాగమణికి ఆరేండ్ల క్రితం పెళ్లైంది. పది నెలల క్రితం భర్త నుంచి విడాకులు పొందారు. నెల రోజుల క్రితం తన చిన్ననాటి మిత్రుడు శ్రీకాంత్ అనే వ్యక్తినియా దగిరిగుట్ట దేవస్థానం వద్ద ప్రేమ వివాహం చేసుకున్నారు. శ్రీకాంత్ వేరే కులానికి సం బంధించిన వ్యక్తి కావడంతో ఆమె తమ్ముడు పరమేశ్ వ్యతిరేకించాడు. నిన్న సెలవు కావడంతో రాయపోల్ వెళ్లిన నాగమణి ఇవాళ తెల్లవారుజామున డ్యూటీ కోసం హయత్ నగర్ వచ్చేందుకు స్కూటీపై బయల్దేరింది. గ్రామ శివారులోనే పరమేశ్ అక్క నాగమణి స్కూటీని కారుతో ఢీకొట్టాడు. అంతటితో ఆగక వెంట తెచ్చుకున్న వేట కొడవలితో దాడి చేసి గొంతు కోసి హతమార్చాడు. తీవ్ర రక్తస్రా వం కావడంతో నాగమణి అక్కడికక్కడే చని పోయారు. తన అక్క నాగమణిని హత్య చేసిన తర్వాత పరమేశ్ పోలీసుల వద్దకు వెళ్లి లొం గిపోయాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తల్లిదండ్రులకు నాగమణి, పరమేశ్ ఇద్దరు సంతానం.. తల్లిదండ్రులు అనారోగ్యంతో కొ న్నేండ్ల క్రితం మృతి చెందారు. వారసత్వంగా నాలుగెకరాల భూమి వచ్చింది. అందులో ఒక ఎకరం నాగమణి పేరిట ఉంది. కులాంతర వివాహం తర్వాత పరమేశ్ నాగమణిపై ఒత్తిడి తెచ్చి ఆ ఎకరం భూమికి సేల్ డీడ్ చేయించు కున్నాడు. భవిష్యత్ లో ఆ భూమిపై తనకు ఎలాంటి హక్కూ ఉండదంటూ బాండ్ పేపర్ రాసియ్యాలని నాగమణిపై ఒత్తిడి తెచ్చాడు. పరమేశ్. అందుకు ఆమె ఒప్పుకోకపోవడంతో నేకక్ష పెంచుకొని మట్టుబెట్టాడని స్థానికులు చెబుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిం చాలని డిమాండ్ చేస్తూ శ్రీకాంత్ కుటుంబీకు లు సాగర్ రోడ్డుపై బైఠాయించారు.

Tags:    

Similar News