Child Abuse Case : బాలికపై అత్యాచారం కేసు.. సహకరించిన వ్యక్తికి 20ఏళ్ల జైలు శిక్ష
బాలికపై అత్యాచారం కేసులో సహకరించిన వ్యక్తికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ. 2లక్షలు నష్టపరిహారం చెల్లించాలని అత్యాచారం, పోక్సో కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. ప్రత్యేక పీపీ సునీత బర్ల కథనం ప్రకారం.. మీర్‌పేట్‌కు చెందిన నరేందర్ అలియాస్ చందు ఓ బాలికకు మాయమాటలు చెప్పి సినిమాకు తీసుకెళ్లి తర్వాత మీర్‌పేటలోని తన మిత్రుడు ఏంపల్లి కృష్ణ రూమ్‌కు తీసుకెళ్లాడు.
అక్కడ బాలికపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లి 2016 ఫిబ్రవరి 11న మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు సాక్ష్యాధారాలతో కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. కేసు నడుస్తున్న సమయంలో నరేందర్ అలియాస్ చందు చనిపోగా అతనికి సహకరించిన మిత్రుడు వేంపల్లి కృష్ణకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించడంతో పాటు బాధితురాలికి రూ. 2లక్షలు నష్టపరిహారం చెల్లించాలని న్యాయమూర్తి ఎంకే పద్మావతి తీర్పు వెలువరించారు.