చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ( Medipalli Satyam ) భార్య రూపాదేవి ( Roopa Devi ) ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్‌లోని నివాసంలో ఆమె ఉరివేసుకున్నారు. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది. గత కొన్నేళ్లుగా భార్యా భర్తల మధ్య విభేదాలు ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
రూపా దేవి మృతదేహం పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. భార్య మృతిని తట్టుకోలేక హాస్పటల్లో స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. ఈ విషయం తెలుసుకున్న పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే సత్యంను ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే, రూపాదేవి రెండు రోజుల నుంచి స్కూలుకు వెళ్లలేదు. మరోవైపు.. ఎమ్మెల్యే మేడిపల్లి ఉదయమే నియోజకవర్గానికి వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడే ఉన్నారు. ఈ సమయంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు.