హైదరాబాద్ నగరంలోని మ్యూజియంలో టిఫిన్ బాక్సు చోరీ కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసు సాక్షాధారాలను పరిశీలించిన రంగారెడ్డి కోర్టు జిల్లా నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధించింది. కాగా 2018లో నిజాం మ్యూజియంలో విలువైన వజ్రాలు పొదిగిన బంగారు టిఫిన్ బాక్స్ చోరీ కేసులో గౌసు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో బెయిల్ పై విడుదలైన గౌస్ మళ్లీ నేరాల బాట పట్టాడు. ఈ క్రమంలోనే 2023లో రాజేంద్ర నగర్ పరిధిలో సవర్ ఖాన్ అనే వ్యక్తిని గౌస్ అత్యంత దారుణంగా హత్య చేశాడు. ఈ కేసులో రాజేంద్ర నగర్ పోలీసులు గౌసు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఈ కేసుకు సంబంధించిన అన్ని సాక్ష్యా లను రాజేంద్ర నగర్ పోలీసులు కోర్టుకు సమర్పించారు. విచారణ అనంతరం నిందితుడు గౌస్కు రంగారెడ్డి జిల్లా కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్పు వెలువ రించింది. కాగా గౌస్పై 18 ప్రాపర్టీ నేరాలు, 6 క్రిమినల్ కేసులు ఉన్నాని, వాటిల్లో 1 హత్య, హత్యాయత్నం, 1 రేప్ కేసు ఉన్నట్లు పోలీసులు వివరించారు.