Palnadu : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు అక్కడికక్కడే మృతి
Palnadu : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల మండలం రెంటచింతల వద్ద ఈ ప్రమాదం జరిగింది.;
Palnadu : పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాచర్ల మండలం రెంటచింతల వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్ ఢీకొనడంతో... ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కకడే చనిపోయారు. మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి.
శ్రీశైలం నుంచి రెంటచింతలకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని గురజాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెంటచింతలలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో... మినీ వ్యాన్‌లో 38మంది ప్రయాణికులు ఉన్నారు. మృతలు సంఖ్య పెరిగే అవకాశం ఉంది.