ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు పోలీసులు మృతి
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు ఎస్కార్ట్ వాహనం టైరు పేలడంతో;
Road Accident: శ్రీకాకుళం జిల్లా రంగోయిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసు ఎస్కార్ట్ వాహనం టైరు పేలడంతో డివైడర్‌కు ఢీకొట్టి... పక్కనే వెళ్తున్న లారీని కూడా ఢీకొట్టింది. దీంతో... ఎస్కార్ట్ వాహనంలోని నలుగురు ఏఆర్ పోలీసులు మృతి చెందారు. వీరిని ఎచ్చెర్లకు చెందిన ఎస్‌ఐ కృష్ణంనాయుడు, కానిస్టేబుళ్లు పి.జనార్దన్, బాబూరావు, ఆంటోనీగా గుర్తించారు. ఆర్మీ జవాను అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానిక పోలీసులు తెలిపారు.