కర్నూలులో టీడీపీ నేత సంజన్న దారుణ హత్యకు గురయ్యారు. గతంలో ఆయన వైసీపీ లో పని చేశారు. సంజన్న రోజూ మాదిరిగానే శుక్రవారం రాత్రి 9 గంటలకు గుడేకల్లు మెడిటేషన్ సెంటర్ కు వెళ్లారు. తిరిగి వచ్చే సమయంలో కర్నూలు శరీన్ నగర్ కు చెందిన రామాంజనేయులు (అంజి), ఆయన అనుచరులు దారి కాసి మరీ సంజన్నపై కత్తులతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. సంజన్నను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సంజన్న మృతి చెందారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.